Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా…*

*➡️“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి*

 

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు*

 

➡️ వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 81 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ గారు, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.

 

*ఎస్పీ గారు పేర్కొన్న ముఖ్య అంశాలు :-*

 

* పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.

* ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం.*

 

🔰 ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి గారు నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.

 

👉 ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, మహిళా పి.ఎస్ డి.ఎస్.పి శ్రీ బాలస్వామి రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

 

 

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.

Related posts

పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. ఎంపీ దగ్గు మల్ల 

Garuda Telugu News

తిరుపతిలో ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్ ప్రారంభం

Garuda Telugu News

సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

Garuda Telugu News

Leave a Comment