Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

*మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత*

తిరుమల, 2026 జనవరి 04: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు.

 

మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

 

సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.

 

*ఆర్జితసేవలు రద్దు*

 

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

 

శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.

 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Related posts

రామగిరి అంకాలమ్మ ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

Garuda Telugu News

“పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన – ఓపెన్ హౌస్” ప్రారంభం

Garuda Telugu News

Leave a Comment