తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు
తీవ్ర తుఫాన్ ప్రభావం కారణంగా జాతీయ రహదారులు మరియు రాష్ట్ర హైవేలపై ప్రయాణించే కంటైనర్లు, లారీలు, ప్రైవేటు మరియు వాణిజ్య వాహనాల రాకపోకలపై ప్రజల భద్రత కోసం తాత్కాలిక ఆంక్షలు విధించబడుతున్నాయి.జిల్లా ఎస్పి శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారు.
ఈ రోజు (28 అక్టోబర్) రాత్రి 7.00 గంటల నుండి, భారీ వాహనాలను జాతీయ రహదారుల వెంట ఉన్న హోల్డింగ్ ప్రాంతాల్లో నిలిపివేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు, తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రత కోసం ఈ చర్యలు చేపట్టబడుతున్నాయి.
అన్ని జాతీయ రహదారులు మరియు రాష్ట్ర హైవేల్లో భారీ వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడి, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడమైనది.
ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని, మరియు ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాకుండా, ప్రజల భద్రతను కాపాడడమే ప్రధాన లక్ష్యం. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ ఆంక్షలు ఉపసంహరించబడతాయి.
ప్రజలు పోలీస్ శాఖ, వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ నుండి వచ్చే హెచ్చరికలు మరియు సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం —
డయల్ 112 కు కాల్ చేయండి లేదా పోలీస్ వాట్సాప్ నంబర్: 8099999977 కు సమాచారం పంపవచ్చు.
తుఫాన్ సమయంలో ప్రజల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
