Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ గవర్నెన్స్‌ ప్రారంభించి అనేక రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా మరిన్ని సేవలను ఇందులో చేర్చుతున్నారు.

 

తాజాగా, టీటీడీకి సంబంధించి నాలుగు సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.

 

స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్స్‌ సమాచారంతో పాటు ప్రస్తుతం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి? సర్వ దర్శనం క్యూలైన్ ఏ మేరకు ఉంది? శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతోంది? శ్రీవాణి టికెట్లకు సంబంధించిన సమాచారం వంటివి దీని ద్వారా భక్తులు తెలుసుకోవచ్చు. రూమ్స్‌ కోసం డిపాజిట్ రీఫండ్ వివరాల వంటి సమాచారం కూడా అందుకోవచ్చు.

 

టికెట్లు ఇలా బుక్‌ చేసుకోవచ్చు..

 

9552300009 వాట్సాప్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి.

 

వాట్సాప్ తెరిచి ఆ నంబర్‌కు “హాయ్” మెసేజ్ పంపండి.

 

మీకు కావాల్సిన సేవలను ఎంచుకోండి

అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి “ఆలయ బుకింగ్ సేవలు” ఎంచుకోండి.

 

దర్శన టిక్కెట్లు, సేవా రిజర్వేషన్లు, వసతి, ఇతర సేవలను బుక్ చేసుకోవడానికి చాట్‌బాట్ సూచనలు ఇస్తుంది.

Related posts

మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారెతో కలిసి నివేదిక అందజేయడం జరిగింది

Garuda Telugu News

దుమ్ము భరించ లేకున్నాం

Garuda Telugu News

సత్యవేడు వెలుగులో కుర్చీలకు కూడా “కరువాయే”

Garuda Telugu News

Leave a Comment