ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే పీ జీ ఆర్ ఎస్

పీజీఆర్ఎస్ ద్వారా ఇందిరానగర్ పంచాయతీ కి పారిశుధ్య కార్మికులు నియామకంకు చర్యలు.
ప్రజలు, పి జి ఆర్ ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని డీవీఎంసీ మెంబెర్ గుత్తి త్యాగరాజు విజ్ఞప్తి.
వరదయ్యపాలెం, సెప్టెంబర్ 25
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం పీజీఆర్ఎస్.
అటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఆగష్టు 28 న ఇందిరానగర్ పంచాయతీ నందు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని
గుత్తి త్యాగరాజు(గ్రీవన్స్ నెంబర్ #) TPT20250828344 తో నమోదు చేసిన అర్జీ సమర్పించడం జరిగింది. జిల్లా పంచాయతీ రాజ్ విభాగం నుండి గ్రామపంచాయతీ రాజ్ విభాగానికి పంపించామని,మీ అర్జీ పై చర్యల పురోగతిని దయచేసి https://pgrs.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
సెప్టెంబర్ 25 న ఇందిరానగర్ పంచాయతీ ఇద్దరు పారిశుద్ద్య కార్మికులు నియామకానికి చర్యలు చేపట్టినట్టు ఇంచార్జి ఈఓపిఆర్డి బసిరెడ్డి తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక
గుత్తి త్యాగరాజు ,(గ్రీవన్స్ నెంబర్ #) TPT20250828344 తో నమోదు చేసిన అర్జీని పరిష్కరించాము అని తెలిపారు.మరిన్ని వివరాలను దయచేసి https://pgrs.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు అని మెసేజ్ పంపుతూ, పీజీ ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకున్నందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ధన్యవాదములు తెలిపారు.
ప్రజలు కూడా సమస్యల పరిష్కారం కొఱకు, ప్రభుత్వం కల్పించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
