Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం లో రైతులకు పెద్దపీట

*కూటమి ప్రభుత్వం లో రైతులకు పెద్దపీట*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

✍️ *అప్పంబట్టులో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

✍️ *మినీ గోకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే*

 

కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.

 

శనివారం పిచ్చాటూరు మండలం అప్పబట్టు లో అన్నదాతలకు ప్రభుత్వం అందించే నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీ సర్వే ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో భూములను సర్వే చేసి రైతులకు శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తుందన్నారు.

 

అలాగే సబ్సిడీ విత్తనాలు, గిట్టుబాటు ధరలకు రైతుల నాయకులు నుండి పంట కొనుగోలు, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు.

 

అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.

 

*మినీ గోకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం*

 

ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్డు ను ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం అప్పబట్టు లో ప్రారంభించారు.

 

పాడి రైతులను అన్నీ విధాలుగా ఆదుకోవాలన్న తపనతో ప్రభుత్వం మినీ గోకులం, పశువుల నీటి తొట్టె నిర్మాణ పనులను చేపడుతుందన్నారు.

 

పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

 

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Garuda Telugu News

ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ

Garuda Telugu News

గత రెండేళ్లలో మొత్తం 576 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు

Garuda Telugu News

Leave a Comment