Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మార్చిలోపు పన్ను బకాయిలు చెల్లించండి

*మార్చిలోపు పన్ను బకాయిలు చెల్లించండి.*

*కమిషనర్ ఎన్.మౌర్య.*

నగరంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్ను బకాయిలు మార్చిలోపు చెల్లించాలని, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల చెల్లింపులపై రైల్వే, దూరదర్శన్, ఈ ఎస్ ఐ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ఆదాయ పన్ను శాఖ, టిటిడి, స్విమ్స్, తెలుగు గంగ, అలిండియా రేడియో, కమర్షియల్ టాక్స్, పోలీస్, యూత్ హాస్టల్, ఎస్వీయు, మహిళా వర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, డి.ఆర్.డి.ఏ తదితర విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎక్కువ పన్నులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణకు నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మార్చి లోపు అధికారులు పెండింగ్ లో ఉన్న బిల్లులు అందరూ చెలిస్తే నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంటుందని తెలుప్పారు. పన్ను బకాయిలు చెల్లించని యెడల డ్రైనేజి, నీటి సరఫరా లను తొలగిస్తామని తెలియజేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతుల యూరియా అవస్తల పరిష్కారానికి సహకారం

Garuda Telugu News

రౌడీ షీటర్ల పై మరోసారి కొరడా జులిపించిన సత్యవేడు సిఐ మురళి నాయుడు మరియు ఎస్సై

Garuda Telugu News

పాత కూరగాయల మార్కెట్ లో గల సమస్యలన్నిటికీ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం…..

Garuda Telugu News

Leave a Comment