Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కొండకిందవారిపల్లె తాగినీటి సమస్యకు తీరేనా…

కొండకిందవారిపల్లె తాగినీటి సమస్యకు తీరేనా.

దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వడు అన్న చందంగా ఉంది గ్రామ ప్రజల తాగునీటి పరిస్థితి..

తక్షణమే లోకల్ చోటా మోటా నాయకులు పై చర్యలు తీసుకోవాలి

సిపిఐ ( ఎం ఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ

 

రాయచోటి న్యూస్

అన్నమయ్య జిల్లా

 

16 నెలలుగా తాగునీటి బోరు చెడిపోయి అధికారులకు చెపుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ అన్నారు గత నెల కొండకిందవారి పల్లె సమస్యను పరిష్కరించాలని స్థానికులు నిరసన చేయడం జరిగిందన్నారు అయితే మాధవరం గ్రామం టిడిపి లోకల్ నాయకులు ఉద్దేశపరంగా ‌ తాగునీటి సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడుతూ బెదిరిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు ‌.ఇటువంటి వారి పైన గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పందించి ఇలాంటి లోకల్ చోట మోటా నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు . వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ తాగడానికి నీళ్లు బాగ లేకున్న కూడ ప్రజలు దాహం తీర్చుకుంటున్నారన్నారు.

కొండకిందవారి పల్లి సమస్యపై అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ‌ మాధవరం గ్రామం టిడిపి లోకల్ నాయకులు వ్యవహార శైలి వలన సామాన్య పేద ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. తాగునీటి సమస్య ఎక్కడ ఉన్న కూడా వెంటనే ‌ మంత్రివర్యులు స్పందించి సమస్యను ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ వస్తున్నారన్నారు. మాధవరం గ్రామంలో ఉన్న ఒకరిద్దరూ ఖద్దర్ షర్టు ఖద్దర్ పంచ. కట్టుకోని సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించుతూ మంచి చేయకపో కీడు చేయడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. వీరికి గ్రామంలో పట్టుమని పది ఓట్లు లేవని ఆయన విమర్శించారు తాగునీటి సమస్య కూడా రాజకీయం చేస్తూ ఉండడం చాలా దారుణమైన విషయం అన్నారు కొండ కిందవారిపల్లె సమస్యకు దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వడు అన్న చందంగా ఉంది గ్రామ ప్రజల తాగునీటి పరిస్థితి నెలకొంది అన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకుండా లోకల్ నాయకులు మాటలు విని వారు కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ లోకల్ చోటామోటా నాయకులు గ్రామాల్లోకి పోతే భడిత పూజ ప్రజలు పడతారని ఆయన అన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి కొండ కింద వారి పల్లె సమస్యను పరిష్కారం చేయాలని ఆయన కోరారు లేని పక్షంలో సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

అభినందనలతో

మావులూరి విశ్వనాథ్

సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

అన్నమయ్య జిల్లా కార్యదర్శి

Related posts

వచ్చే ఎన్నికల్లో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత

Garuda Telugu News

మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

జ్యూరిచ్ : చంద్రబాబు అంటేనే ఎనర్జీ :- నారా లోకేష్

Garuda Telugu News

Leave a Comment