Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ సమీవేశంలో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

*తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ సమీవేశంలో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు*

* తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని ఇటీవల తెలుగుదేశం పార్టీ నియమించింది.

 

* స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో కమిటీ సభ్యులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీ మతి పనబాక లక్ష్మి గారు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు.

 

* ఇటీవల 42 మంది సభ్యులతో కూడిన తిరుపతి పార్లమెంటు కమిటీని నియమించిన తెలుగుదేశం పార్టీ.

 

* ముందుగా తిరుపతి పార్లమెంటు కమిటీ సభ్యులు పరిచయ కార్యక్రమం నిర్వహించి తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష్య,కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు.

 

* తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహణ.

 

* డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తిరుపతి పార్లమెంటు పరిధిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

 

* ప్రతి వారం ప్రజాదర్బార్లో గ్రామస్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు ప్రతి నాయకుడు,కార్యకర్త పాల్గొనేలా దిశానిర్దేశం చేశారు.

 

* కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సభ్యులకు సూచించిన తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు.

 

* నూతనంగా ఏర్పడిన తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష్యరాలు, ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు.

 

* ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు,తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

Garuda Telugu News

నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్

Garuda Telugu News

శ్రీ మహాలక్ష్మి అవతారంలో పోలేరమ్మ దర్శనం…

Garuda Telugu News

Leave a Comment