Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన జైలు శిక్ష…

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ..

– ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన జైలు శిక్ష.

 

– నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష..ఒక్కొక్కరికి రూ.3,00,000/- లక్షల జరిమానా.

 

– తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో అమలులో ఉన్న గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ఫలితంగా, ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

 

– 2018లో ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసు నెం.07/2018లో, తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ ఏడిజె కోర్టు నలుగురు నిందితులు, బీముల శ్రీరాములు (46), పెండి హరి (36), చుక్కలపాటి ఎర్రయ్య (30), కానూరు శివ (35),లను దోషులుగా నిర్ధారిస్తూ, 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది.

 

– ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు, అడవుల సంపదను కాపాడటంలో పోలీస్ శాఖ ఎలాంటి రాజీ పడదని, ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

 

– ఈ కీలక కేసు విచారణ, పర్యవేక్షణ, కోర్టు లైజనింగ్‌లో అద్భుతమైన కృషి చేసిన, బేతపూడి ప్రసాద్, డీఎస్పీ, చంద్రగిరి (పర్యవేక్షణ) ఏ.అమరనారాయణ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీ డి. గోపి, అప్పటి ఎస్ఐ, ఎర్ర వారి పాలెం (దర్యాప్తు అధికారి), ఇమ్రాన్ బాషా, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎర్ర వారి పాలెం , బి.వి. లోకేష్ ప్రస్తుత ఎస్ఐ, ఎర్ర వారి పాలెం , హరినాథ్, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్, డి.దుర్గాప్రసాద్ , కోర్టు కానిస్టేబుల్ ల ను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

టీటీడీకి రూ.కోటి విరాళం

Garuda Telugu News

విజ్ఞాన, వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది

Garuda Telugu News

తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

Garuda Telugu News

Leave a Comment