Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఒక్క హెల్మెట్, వంద ప్రమాదాల నివారణ!

*ఒక్క హెల్మెట్, వంద ప్రమాదాల నివారణ!*

– సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదర

 

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచేందుకు పోలీస్ శాఖ ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు సోమవారం సత్యవేడు మండల కేంద్రంలోని శ్రీకాళహస్తి రోడ్ వద్ద సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదరి తన బృందంతో కలిసి ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాల ప్రమాదాలు నేటి సమాజంలో సాధారణ సమస్యగా మారాయని, ప్రాణ నష్టాలను నివారించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ను కేవలం జరిమానా తప్పించుకునే సాధనంగా కాకుండా, జీవితాన్ని రక్షించే రక్షణ కవచంగా భావించాలన్నారు. చిన్న దూరమైనా హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, అధిక వేగంతో వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాపాయానికి కారణమవుతుంద

Related posts

రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ

Garuda Telugu News

గంగమ్మ జాతరలో కనువిందు చేసిన అప్పిశెట్టి 

Garuda Telugu News

పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి…..

Garuda Telugu News

Leave a Comment