Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ

శ్రీకాళహస్తి, జనవరి 5:

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నాసా ప్రాజెక్ట్‌కు గతంలో శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపికైన విద్యార్థులకు నారాయణ పాఠశాల AGM శ్రీనివాసులు మరియు స్థానిక పీఎల్‌ఆర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లోకేష్ రెడ్డి నాసా కిట్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాసులు మాట్లాడుతూ, భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పరిస్ధితులపై విద్యార్థులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ శాస్త్రీయ ఆలోచనలను అలవర్చుకోవాలని అన్నారు. అదేవిధంగా డాక్టర్ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ, శాస్త్రసాంకేతిక రంగంలో థామస్ ఎడిసన్ చేసిన సేవలను గుర్తు చేస్తూ, నిరంతర పరిశోధనతోనే గొప్ప ఆవిష్కరణలు సాధ్యమవుతాయని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య, ఆర్.ఐ కిరణ్, కోఆర్డినేటర్ శ్రీకాంత్, డీన్ కేడర్, నాసా ఇన్‌చార్జ్ పావని, రాజేశ్వరి, ఏ.ఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని మరింత పెంపొందించిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Related posts

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

సరఫరా గొలుసు స్థిరత్వంలో శ్రీసిటీ కీలక పాత్ర – ఇండియా-జపాన్ వ్యాపార సమావేశంలో శ్రీసిటీ ఎండీ 

Garuda Telugu News

గాంధి జయంతి.. మద్యం, మాంసం నిషేధం..

Garuda Telugu News

Leave a Comment