Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు

*ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు.*

తిరుపతి గరుడ్డద త్రిన్యూస్

*క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించండి. – కమిషనర్ ఎన్. మౌర్య.*

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ కమిషనర్ ను కోరారు. కాగా మధురా నగర్ నందు రోడ్డు గుంతలు ఉండడంతో ఆక్రమణకు గురవుతున్నదని, రోడ్డు వేయాలని, మునిసిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న కంటింజెన్సీ వర్కర్స్ కు జీతాలు పెంచాలని, టిడిఆర్ బాండ్లు ఇప్పించాలని, భవాని నగర్ నందు పగిలిపోయిన డ్రైనేజి పైప్ లైన్ మరమ్మతులు చేయాలని, రవీంద్ర నగర్ లో యూడీఎస్, త్రాగునీటి పైప్ లైన్ వసతి కల్పించాలని, కె. బి. లేఔట్ నందు మ్యాన్ హోల్ సమస్య పరిష్కరించాలని, చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మలు తొలగించాలని, బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ ఎదురుగా ఇన్న రోడ్డులో గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం కూడలి వద్ద సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని, కరకంబాడీ – లీలా మహల్ డెడ్ ఎండ్ వద్ద గరుడవారధి లీక్ అవుతున్నది అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

Related posts

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

Garuda Telugu News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూక తోటి రాజేష్

Garuda Telugu News

Leave a Comment