Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పలు రోడ్డు భద్రతా చర్యలు చేపడుతోంది

*చిత్తూరు జిల్లా పోలీసు*

*చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పలు రోడ్డు భద్రతా చర్యలు చేపడుతోంది.*

 

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టి.సాయినాథ్ గారి పర్యవేక్షణలో, హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై, రంగంపేట క్రాస్ నందు పూతలపట్టు ఇన్స్పెక్టర్ శ్రీ గోపి గారు హెల్మెట్ ధారణపై ఒక ఫ్లెక్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడం. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తల గాయాల కారణంగానే ప్రాణ నష్టం సంభవిస్తోందని, హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పూతలపట్టు ఇన్స్పెక్టర్ శ్రీ డి.గోపి గారు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారు మాత్రమే కాకుండా వెనుక కూర్చునే పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 

చిత్తూరు–తిరుపతి రహదారి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటైనందున, ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్లెక్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, హెల్మెట్ ధారణ అనేది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశమని ఇన్స్పెక్టర్ గారు పేర్కొన్నారు.

 

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమానికి ప్రజలు సహకరించి, రోడ్డు భద్రతా నియమాలను పాతించాలని పోలీస్ వారు విజ్ఞప్తి చేశారు.

Related posts

పర్యాటకంగా గంగమ్మ ఆలయాభివృద్ధి కి సహకారం అందిస్తాం…

Garuda Telugu News

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపండి – కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం

Garuda Telugu News

వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన…

Garuda Telugu News

Leave a Comment