తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

– రోడ్డు భద్రత వారోత్సవాలు 2026 (Road Safety Week–2026)
– తిరుపతి నగరంలోని SR Defence Academy లో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నిర్వహించడం జరిగింది.
– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు,ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు,రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ట్రాఫిక్ నియంత్రణ విధానం,రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు మరియు చట్టాలపై విస్తృత అవగాహన మొదలగు అంశాలపై కల్పించడం జరిగింది.
– అలాగే, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ స్వీయ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని, ముఖ్యంగా యువత రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన దృక్పథం కలిగి ఉండాలని విద్యార్థులకు వివరించారు.
– ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు సందేశం ఇస్తూ ప్రతి రోడ్డు ప్రమాదం నివారించదగినదే. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చు. ప్రజలందరూ, ముఖ్యంగా యువత, రోడ్డు భద్రతను తమ జీవితంలోని ముఖ్యమైన భాగంగా తీసుకోవాలి అని సందేశం ఇచ్చారు.
– ఈ అవగాహన కార్యక్రమాన్ని శ్రీ ఏ. సంజీవ కుమార్,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తిరుపతి నిర్వహించారు
