Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చాంపియన్ ఫార్మర్స్ కు సేంద్రీయ ఎరువులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

*చాంపియన్ ఫార్మర్స్ కు సేంద్రీయ ఎరువులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

బుచ్చిరెడ్డి పాళెం మండల వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ఎంపిక చేసిన 80 మంది రైతులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సేంద్రీయ ఎరువులను పంపిణి చేశారు. బుచ్చిరెడ్డి పాళెం మండలం కాగులపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చిన రైతులను ఈ సందర్భంగా అభినందించారు. రసాయన ఎరువుల వినియోగం కారణంగా భూములు నిస్సారమైపోతున్నాయన్నారు. సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి వున్న రైతులకు కూటమి ప్రభుత్వంప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.

సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హామీ యిచ్చారు. చాంపియన్ ఫార్మర్స్ కు సోలార్ లైట్ ట్రాప్స్, బయో ఫెర్టిలైజర్స్, మరియు సహజ పద్ధతిలో తెగుళ్లను నివారించే వేప చెక్క తదితర ఇన్ పుట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి అనిత మరియు స్థానిక టిడిపి రైతు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

Garuda Telugu News

ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఇంటి పై మళ్లీ ఏసీబీ దాడులు…

Garuda Telugu News

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…

Garuda Telugu News

Leave a Comment