Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శెట్టిపల్లి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

*శెట్టిపల్లి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి*

* తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు శెట్టిపల్లి పరిధిలోని భూములను మరియు అభివృద్ధి పనులకు ప్రతిపాదించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా,తిరుపతి పరిసర ప్రాంతాలను మోడల్ కాలనీలు గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

 

* శెట్టిపల్లి ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ, విశాలమైన రహదారులు మరియు పచ్చదనానికి పెద్దపీట వేస్తాం అని తెలిపారు.

 

* ఇక్కడ నివసించే ప్రజలకు మెరుగైన ప్రమాణాలు కల్పించేందుకు తుడా నిరంతరం కృషి చేస్తుంది.

 

* శెట్టిపల్లి ప్రాంతం అభివృద్ధి అత్యంత కీలకమని, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.

 

* భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం,నీటి సరఫరా,సుందరీకరణ,విద్యుత్ సరఫరా,పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తుడా ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.

 

* ప్రభుత్వ మరియు తుడా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనధికారిక లేఅవుట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

* అంతకముందు అక్కడికి చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని శెట్టిపల్లి రైతులు,నాయకులు సత్కరించారు.

 

* ఈ కార్యక్రమంలో తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి తుడా అధికారులు,సర్వేయర్లు,ఇంజనీర్లు మరియు రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

హెల్మెట్ ధారణ మరియు ఇతర రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

Garuda Telugu News

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Garuda Telugu News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు

Garuda Telugu News

Leave a Comment