Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గోవధ యత్నం అడ్డుకోవాలి….

గోవధ యత్నం అడ్డుకోవాలి….

కాట్రపల్లి ఎస్టీ కాలనీలో ఘటనపై బిజెపి నేతలు కోలా ఆనంద్, పీఎం శేఖర్ యాదవ్ ఆందోళన

 

కేవీబీపురం-గరుడ తెలుగు టీవీ

 

కేవీబీపురం మండలంలోని కాట్రపల్లి ఎస్టీ కాలనీలో సుమారు వందకు పైగా ఆవులు, ఎద్దులను అక్రమంగా వధించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిజెపి నాయకుడు పీఎం శేఖర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ గోవధ యత్నాలను తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గోవులను అక్రమంగా తరలించి వధించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే, మండలంలోని బిజెపి నాయకులు, గోసంరక్షణకు కట్టుబడి ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అప్రమత్తమయ్యారని తెలిపారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని కోరారు.

గోవధకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, గోవులను రక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని శేఖర్ యాదవ్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

మండలాన్ని శాసిస్తున్న భార్యాభర్తలు… చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు 

Garuda Telugu News

*ఏపీలో ఉచిత బస్సు.. ఉగాదికి ఫిక్స్!

Garuda Telugu News

శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం 

Garuda Telugu News

Leave a Comment