Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ పరంగా వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేస్తున్నాం…

*రెవిన్యూ పరంగా వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేస్తున్నాం…*

*రైతుల పాసు పుస్తకాలపై తన బొమ్మలు వేసుకుని వారి హక్కులను కాలరాసిన వ్యక్తి జగన్…*

 

*ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది…*

 

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో సత్యవేడు జడ్పిటిసి మరియు సత్యవేడు తాసిల్దారు మరియు సత్యవేడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ *కూరపాటి శంకర్ రెడ్డి* గారు

 

రెవిన్యూ పరంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, వైసిపి పాలనలో జరిగిన అవకతవకలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి* గారు అన్నారు. సత్యవేడు మండలం మదనంజేరి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెవిన్యూ గ్రామసభలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో *కూరపాటి శంకర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో సత్యవేడు మండల జడ్పిటిసి విజయలక్ష్మి గారు, సత్యవేడు మండల తాసిల్దార్ గారు , టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కిష్టయ్య గారు ,పరమశివం గారు, లోకా రెడ్డి గారు, మోహన్ గారు, బాలరాజు గారు, పి మురళి గారు, షణ్ముగం గారు,శివయ్య గారు, మరియు సత్యవేడు నియోజకవర్గ టిడిపి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. *కూరపాటి శంకర్ రెడ్డి* గారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో చేసిన తప్పులతో రెవెన్యూ పరమైన లక్షలాది సమస్యలు వెలుగులోకి రావడం జరిగిందన్నారు. ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. వైసీపీ పాలన వల్ల ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అయితే చాలా సంక్షిష్టంగా మారాయన్నారు. సామాన్య ప్రజల రెవెన్యూ రికార్డులు అన్నీ తారు మారు అయిపోయి నేటికీ అనేక రకాల ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం పాస్ బుక్ ల పంపిణీ పేరుతో, సర్వేల పేరుతో అనేక అవకతవకలు చేసిందన్నారు. ప్రజలకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులపై హక్కును కాలదన్నేలా, రాజముద్రతో ఇవ్వవలసిన పట్టాదారు పాస్ పుస్తకాలను, ప్రజల కష్టార్జితాన్ని తన సొంత ఫోటోలతో, తన పార్టీ రంగులద్ది తప్పుల తడకలతో జగన్ ఏదో తన సొంత ఆస్తులు ఇచ్చినట్లు ప్రజలకు ఇచ్చారని విమర్శించారు. వాటిలో కూడా అనేక తప్పులు దొర్లాయని అన్నారు. లక్షలాది సమస్యలతో నిండిన వాటిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం సతమతం అవుతుందని, రెవెన్యూ మంత్రి అనగాని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించి అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. భూమిపై రైతులకు హక్కులు కాలరాసేలాగ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిన విషయం గుర్తు చేశారు. ఇందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమం తో పాటు *కూరపాటి శంకర్ రెడ్డి* గారు *ప్రజా దర్బార్* నిర్వహించి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని విని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వీలైనంత త్వరలో సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. మరియు సత్యవేడు నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి

Garuda Telugu News

గీత కార్మికుల మద్యం దుకాణాలకు, దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు

Garuda Telugu News

ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

Garuda Telugu News

Leave a Comment