Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మన డబ్బులు మన లెక్కలు ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

*మన డబ్బులు మన లెక్కలు ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

తేదీ: 02/01/2025

నారాయణ వనం

మన డబ్బులు మన లెక్కలు రెండవ విడత ర్యాలీని ఏ పి ఎం టి. దనంజయ రెడ్డి ఆధ్వర్యంలో సత్య వేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు.

ఈ సందర్బంగా మహిళా సంఘాలు ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి చెంది పేదరికం నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి మహిళ ఆర్థిక ప్రగతికి ప్రణాళిక వేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధి కి సెర్ప్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని వివరించారు.

మహిళా సంఘాలలోనిసభ్యులకు లెక్కల పారదర్శకత్వం కోసం మన డబ్బులు మన లెక్కలు యాప్ ప్రభుత్వం పంపిన వెంటనే ఈ నారీల ద్వారా అందరూ డౌన్లోడ్ చేసుకొని పారదర్శకంగా వారి యొక్క లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు. ఈనారీల ద్వారా మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి యాప్ డౌన్లోడ్ చేయించడం జరుగుతుందని తెలిపారు.

అందరు మహిళలు అన్ని రకాల ప్రభుత్వ స్కీములను ఉపయోగించుకుని లక్షాధికారులు కావాలని ఆకాంక్షించారు.

మహిళా సంఘం సభ్యులు ఎమ్మార్వో కార్యాలయము నుండి ఐ ఓ బి బ్యాంక్ కూడలి వరకు ర్యాలీని చేపట్టి అవగాహన కల్పించడం జరిగింది.

నారాయణపురం మండలం లోని ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయము వద్ద సత్యవేడు నియోజకవర్గంలోని మండలాల సెర్ప్ ఉద్యోగులు గౌరవ ఎమ్మెల్యే గారి కి గజమాల,శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్స్ అందజేసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోనేటి సుమన్, ప్రజా ప్రతినిధులు,ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, తాసిల్దార్ రోజారమణి ఎంపీడీవో అరుణ,ఏపీఎం టి.ధనoజయ రెడ్డి,ఎం ఈ ఓ కోదండ నాయుడు, ఏ పి ఓ సుకన్య, సీసీలు నాగేందర్ రావు, రాజేశ్వరి, అరుణ్ కుమార్, నిమ్మి, వివోఏలు, ఎం ఎస్,వి ఓ లీడర్లు, మహిళాసభ్యులు పాల్గొన్నారు.

Related posts

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

Garuda Telugu News

హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి

Garuda Telugu News

ఈశ్వర కళ్యాణ్ అభయ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్

Garuda Telugu News

Leave a Comment