Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు గుర్తింపు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

– చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు గుర్తింపు

– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న చైల్డ్ ట్యాగ్ భద్రతా చర్యల్లో భాగంగా, ఈ రోజు తిరుమల దర్శనార్థం వచ్చిన వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్రం సింగ్ గారి కుమారుడు సౌభాగ్య సింగ్ (Saubhagya Singh), వయస్సు 7 సంవత్సరాలు, గుర్తించడం జరిగింది.

 

– తిరుమలలోని పాచి కాలువ గేట్ సమీపంలో బాలుడు తన తల్లిదండ్రుల నుండి దారి తప్పాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా, అప్రమత్తమైన పోలీసులు చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా బాలుడి వివరాలను గుర్తించారు.

 

– తదనంతరం అదనపు ఎస్పీ శ్రీ శ్రీనివాసులు గారి సమక్షంలో, బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు కమాడ్ కంట్రోల్లో అప్పగించడం జరిగింది.

 

– ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరఫున, తిరుమలకు వచ్చే భక్తులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని చైల్డ్ ట్యాగ్ విధానాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.

Related posts

తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ సమీవేశంలో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Garuda Telugu News

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ ఐక్యవేదిక కార్యదర్శి,

Garuda Telugu News

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, పాత పెన్షన్ పథకం (OPS)కు సమానమైన ప్రయోజనాలు అందించేలా

Garuda Telugu News

Leave a Comment