Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

✍️ *అన్నదాతలకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

✍️ *పాల్గొన్న ఆర్డీఓ భాను ప్రకాష్, జడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్*

✍️ *మన డబ్బులు – మన లెక్కలు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే*

గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.

శుక్రవార ఉదయం నారాయణవనం తహశీల్దారు కార్యాలయంలో అన్నదాతలకు ప్రభుత్వం అందించే నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీ సర్వే ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో భూములను సర్వే చేసి రైతులకు శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తుందన్నారు.

అలాగే సబ్సిడీ విత్తనాలు, గిట్టుబాటు ధరలకు రైతుల నాయకులు నుండి పంట కొనుగోలు, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు.

అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.

*మన డబ్బులు – మన లెక్కలు ద్వారా మహిళా సంఘాలకు అవగాహన*

వెలుగు ఆధ్వర్యంలో తలపెట్టిన మన డబ్బులు – మన లెక్కలు కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అవగాహన కల్పించారు.

ప్రతి మహిళ తమ సంఘం ద్వారా దాచుకున్న డబ్బులు, తీసుకున్న రుణాలు, వాటికి అయిన వడ్డీ మొత్తం వంటి వివరాలను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు.

ఏమైనా సందేహం కలిగితే అందుబాటులో ఉన్న సంఘమిత్ర, సీసీ, ఏపీఎం లను సంప్రదించి నివృతి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

అనంతరం ఆర్డీఓ భాను ప్రకాష్ జడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, ఏపీఎం, ఎంపిడిఓ, తహసీల్దార్ లతో కలిసి అవగాహన ర్యాలీ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాను ప్రకాష్, నారాయణవనం మండల తహసిల్దార్ రోజా రాణి, ఎంపీడీవో అరుణ ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Garuda Telugu News

శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

Garuda Telugu News

సత్యవేడు మండలంలో ఘనంగా నాగుల చవితి పండుగ

Garuda Telugu News

Leave a Comment