*శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులు సర్వం సిద్ధం
*
*జనవరి 15 న లాటరీ విధానంలో లబ్దిదారులను ఎంపిక చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి*
*ప్లాట్లు కేటాయించబడిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తి మినహాయింపు*
*అర్హులైన వ్యవసాయదారులకు, ప్లాటుదారులకు ప్లాట్లు కేటాయింపులు జరుగుతాయి*
*అధునాతనమైన వసతులతో మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం* *జిల్లా కల్లెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్*
తిరుపతి, జనవరి 01 2026: శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తయాయ్యాని అర్హులైన వారికి లాటరీ విధానంలో ఈ నెల 15 న గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంపిక చేయనున్నానారని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నందు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య, తుడా అధికారులు, ఇతర సంబందిత అధికారులతో కలసి శెట్టిపల్లి గ్రామ కమిటీలు, వ్యవసాయదారులు సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులకు సర్వం సిద్ధం చేసామని, అర్హులైన అందరి వ్యవసాయదారులకు ప్లాటుదారులకు రెండు సెంట్లు తక్కువ లేకుండా ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 15 న లాటరీ పద్దతిలో గౌ. ముఖ్యమంత్రి లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్లాట్ ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రిజిస్ట్రేషన్ ఫీజుల సమస్యకు సంబంధించి గౌ.ముఖ్యమంత్రి కూడా కేబినేట్లో చర్చించి పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన లబ్దిదారులకు అందించే రిజిస్ట్రేషన్ పత్రాలు పక్కాగా హద్దులతో సహా ముద్రించి ఇచ్చే విధంగా తుడా, రెవిన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఒక రోజున పండుగ వాతవరణంలో పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మోడల్ టౌన్ షిప్ కు సంబంధించి తుడా ద్వారా 65 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఔట్ నిర్మాణంతో పాటు వాణిజ్య భవనాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజ్, త్రాగు నీరు, విద్యుత్ , మరియు దేవాలయం, పార్కులు, శ్మశానవాటిక వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు .
ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యు అధికారి రాంమోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు,అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, సూర్యనారాయణమ్మ, వాసుదేవనాయుడు ఎస్.ఈ కృష్ణా రెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, తుడా సర్వేయర్ దేవానంద్, గ్రామ సర్వేయర్లు, AECOM సంస్థ ప్రతినిధులు, డి టి రామచంద్ర వి ఆర్ ఓ ప్రసాద్, సర్వేయర్ రమేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
———————————-
డి.ఐ.పి.ఆర్.ఓ, తిరుపతి
