Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమల అన్నప్రసాదంలో మార్పులు…

*తిరుమల అన్నప్రసాదంలో మార్పులు..*

తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాల తయారీపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒకపై మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.బియ్యం నాణ్యతను పరీక్షించడానికి తరచూ ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని భావిస్తున్నారు. మిల్లర్లతో ప్రతినెలా వర్చువల్ గా, ప్రతి మూడు నెలలకోసారి నేరుగా సమీక్ష సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.

 

బియ్యం నాణ్యతపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తిరుమల పద్మావతి విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.

 

బియ్యం శాంపిల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్న ప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు వెంకయ్య చౌదరి ఆదేశించారు. రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని, ఫలితంగా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

 

టీటీడీలో ప్రతిరోజూ తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20 వేల కేజీల బియ్యం వినియోగమౌతోందని, టీటీడీకి 60:40 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్లర్ల బియ్యం సరఫరా చేస్తారని ఆయన అన్నారు. ప్రతినెలా రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులకు ఆదేశించారు.

 

శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెలా అన్న ప్రసాదం నాణ్యతపై సర్వే నిర్వహించాలని, భక్తుల అభిప్రాయాలను అనుసరించి, వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీ లోని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే పోరాటం చేస్తోంది..!

Garuda Telugu News

చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప ద‌ర్శ‌నం

Garuda Telugu News

బాపట్ల రైల్వే స్టేషన్‌‌లో 21 కేజీల గంజాయి పట్టివేత

Garuda Telugu News

Leave a Comment