Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Visakhapatnam

14/11/2025

*30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

 

*ప్లీనరీ సదస్సుకు హాజరైన ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన మంత్రులు యూఎన్ఓ ప్రతినిధులు*

 

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…*

 

•సౌదీ, రష్యా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, జపాన్, కెనడా తదితర దేశాల నుంచి డెలిగెట్స్ ఈ సదస్సుకు హాజరుకావటం సంతోషాన్ని కలిగిస్తోంది

* సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడొద్దు. నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశాం

పరస్పరం పెట్టుబడుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలం అని అంతా గుర్తించాలి

• సింగపూర్ చాలా చిన్న దేశమైనా అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చింది

ఆర్గానిక్ ఉత్పత్తిగా అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. అక్వా ఉత్పత్తులు, నేచురల్ ఫార్మింగ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది

 

ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కొత్త టెక్నాలజీలు ఉంటే వారితో పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంది

• ఏపీలోని సుదీర్ఘ తీరప్రాంతం, గండికోట, అరకు లాంటి ప్రకృతి అందాలు పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలం

అలాగే కొత్తగా భారతీయ రుచులకు సంబంధించిన రంగాల్లోనూ విస్తృత అవకాశాలు వినియోగించుకోవచ్చు

• మా ప్రాంతంలోని సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఎక్స్ పీరియన్స్ సెంటర్లను

• డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం

• సాంకేతికత సాయంతో అతి తక్కువ నష్టంతోనే ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కుంటున్నాం

• నూతన ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశాం

• ఏపీలో 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ పరిశ్రమలకు, ప్రాజెక్టులకు అందుబాటులో ఉంచాం

• భారత్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది

• బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధించింది.

• ఎన్టీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ,

సంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని దేశవిదేశాల ప్రతినిధులకు, పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు!

Related posts

రాజమాణిక్యం కుమారుని వివాహంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా

Garuda Telugu News

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు

Garuda Telugu News

Leave a Comment