*సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించండి*

✍️ *విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ ను కోరిన ఎమ్మెల్యే ఆదిమూలం*
సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన విద్యుత్ సమస్యలను, రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సిఎండి శివశంకర్(IAS) ను కోరారు.
శుక్రవారం తిరుపతి లోని ఏపీ ఎస్పీడిసీల్ సీఎండీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఆదిమూలం చేరుకుని సీఎండీ శివశంకర్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిచ్చాటూరు మండలం ముడియూరు లో ప్రభుత్వం మంజూరు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యుత్ శాఖ సీఎండీ ని కోరారు.
సత్యవేడు మండలం చమర్తి కండ్రిగలో చివరి దశ నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన కోరారు.
తన వినతులకు విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడించారు.
