
దాసుకుప్పం పిహెచ్సి కేంద్రాన్ని సందర్శించిన డిఎం హెచ్ఓ
….సత్యవేడు మండలం దాసుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లావైద్యఆరోగ్య అధికారి బాలకృష్ణ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇమునైజేషన్ అధికారిని అధికారి శాంతకుమారి,జిల్లా టీబీ లెప్రసీ అధికారిని పద్మావతి తో కలిసి ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది.ప్రధానంగా ఓపి,డెలివరీ కేసులకు సంబంధించిన రికార్డులను డిఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ పరిశీలించారు.అలాగే రక్త పరీక్ష గది, మందులు గది,డెలివరీ గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులకు అధిక శాతం పేద రోగులు వస్తుంటారు అన్నారు.పైగా సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో దాసుకుప్పం వైద్యులు డాక్టర్ గుణశేఖర్,మురళీకృష్ణ, ఎంపిహెచ్ఓ సుబ్రహ్మణ్యం,పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
