
*సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు..*
* వైఎస్ఆర్సిపి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్*
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముందస్తుగానే వైఎస్ఆర్సిపి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు.
సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు.
అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువఇచ్చే పెద్ద పండుగని అయన అభివర్ణించారు.
భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు ఆనందం నింపాలని కోరారు..
తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంక్రాంతి కనుమ పండుగను ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని అయన ఆంకాంక్షించారు
