
*తిరుపతి, తేదీ: 31.12.2024*
*జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, గారు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని, సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పని చేయుచున్న జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, తిరుపతి వారి కార్యాలయంలో వీలైనంత తొందరగా అందచేయాలని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు.
—————————————-
*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*
