Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కర్ణాటక రాష్ట్రంలోని యల్లాపుర కు చెందిన రంజితా భాన్సోడే అనే యువతికి స్థానికంగా ఉన్న ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది…

*కర్ణాటక రాష్ట్రంలోని యల్లాపుర కు చెందిన రంజితా భాన్సోడే అనే యువతికి స్థానికంగా ఉన్న ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది.*

ఈమెకు 12 ఏళ్ల క్రితం వివాహం కాగా కుటుంబ కలహాల కారణంగా 5 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి.. ప్రస్తుతం ఒంటిరిగా జీవిస్తోంది. అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు రపీఫ్‌ ఇసామ్‌సాబ్‌కు ఈ విషయం తెలిసింది.దీంతో రఫిక్ తరచూ ఆమెను కలిసేందుకు ప్రయత్నిస్తూ.. తనను పెళ్లి చేసేకోవాలని వేధించడం స్టార్ట్ చేశాడు. కొన్ని సార్లు నేరుగా ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి ఇబ్బందులకు గురిచేయడం కూడా చేశాడు. దీంతో విసిగిపోయిన రంజిత.. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రఫిక్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం పథకం ప్రకారం ఆమె స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా.. మార్గ మధ్యలో దారికాచి కత్తితో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రంజిత అన్నా, వధినలు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.అయితే ఆమె పరిస్థితి విషమించడంలో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హుబ్బళ్లిలోని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న రఫిక్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇద్దరివి వ్యతిరేక మతాలు కావడంతో దీన్ని లవ్‌జిహాద్‌గా పరిగణించిన కొన్ని హిందూ సంఘాలు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు.అయితే మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకన్న పోలీసులు రఫిక్ ఆచూకీ కోసం గాలిస్తుండగా ఆదివారం ఉదయం యల్లాపురకు సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాం దొరికింది

Related posts

సిఐటియు జాతీయ మహాసభలు డిసెంబర్ 31 నుండి, జనవరి 4 వరకు జరిగే మహాసభలు జయప్రదం చేయండి! సిఐటియు జిల్లా నేతలు పిలుపు!!

Garuda Telugu News

ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబుకు ఘన సన్మానం

Garuda Telugu News

మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి

Garuda Telugu News

Leave a Comment