*వీటితోనే సంక్రాంతి సంబరం మొదలు.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!*

* సంక్రాంతికి తెలుగు వారికే కాదు, సినిమా వాళ్లకు ఇదొక పెద్ద సంబరం. అందుకే అగ్ర కథానాయకుల నుంచి యువ హీరోల వరకూ తమ సినిమాలు సంక్రాంతికి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఏడాది కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఈసారి పండగకు ముందుగానే కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్లో ప్రేక్షకులను అలరించే చిత్రాలివే.. ఓటీటీ వినోదం ఏంటి?
