*అన్నదాతల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *కృష్ణాపురంలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*
✍️ *కాలంజేరిలో మినీ గోకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే*
✍️ *మన డబ్బులు – మన లెక్కలు అవగాహన ర్యాలీ లో ఎమ్మెల్యే*
✍️ *నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం*
అన్నదాతల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.
సోమవారం నాగలాపురం మండలం కృష్ణాపురంలో అన్నదాతలకు ప్రభుత్వం అందించే నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీ సర్వే ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో భూములను సర్వే చేసి రైతులకు శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తుందన్నారు.
అలాగే సబ్సిడీ విత్తనాలు, గిట్టుబాటు ధరలకు రైతుల నాయకులు నుండి పంట కొనుగోలు, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు.
అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.
*మినీ గోకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం*
ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్డు ను ఎమ్మెల్యే ఆదిమూలం సోమ కాలంజేరి లో ప్రారంభించారు.
పాడి రైతులను అన్నీ విధాలుగా ఆదుకోవాలన్న తపనతో ప్రభుత్వం మినీ గోకులం, పశువుల నీటి తొట్టె నిర్మాణ పనులను చేపడుతుందన్నారు.
పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
అనంతరం మన డబ్బులు – మన లెక్కలు అవగాహన ర్యాలీ లో ఎమ్మెల్యే పాల్గొని మహిళ సంఘం సభ్యులకు అవగాహన కల్పించారు.
తదుపరి విద్యుత్ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు.
చివరగా పిచ్చాటూరు మండలం రామగిరి లో టిడిపి నాయకురాలు రాజేశ్వరి తండ్రి పార్తీబన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
