Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలి : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

*పెరుమళ్ళపాడు, జనవరి 4 :*

*ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలి : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

*జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టం… తిరిగి ఇచ్చేయాలని రైతులకు పిలుపు*

 

*ప్రభుత్వ రాజముద్రతో, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నాం*

 

*గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు… తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి ఆనం*

 

*ఇప్పుడు ఇస్తున్న పాస్ పుస్తకాలను అధికారులు ఇష్టప్రకారం మార్చడానికి కుదరదు… ఏం మార్పులు చేయాలన్నా డేటా సెంటర్ నుంచే మార్పులు చేయాల్సి ఉంటుంది*

 

*ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వున్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి*

 

➖ “మీ భూమి – మీ హక్కు” నినాదంతో పెరుమాళ్ళపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి ఆనం

 

➖ రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ డిజిటల్ భూ రికార్డులతో పారదర్శకత పెరిగిందని, వివాదాలకు చెక్ పడుతుందని వ్యాఖ్య

 

➖ పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏ చిన్న తప్పు జరిగినా తక్షణమే సరిచేస్తాం : మంత్రి ఆనం

 

➖గత ప్రభుత్వం కోటి మంది రైతుల భూములకు వారి భూమిపై వారికి హక్కు లేకుండా ఎందుకు పనికిరాని పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేసింది

 

➖ ఎన్నికలకు మూడు నెలల ముందే ఈ దుర్మార్గపు ఆలోచన చేసి 35 లక్షల రైతుల పాస్ పుస్తకాలను మార్చేశారు

 

➖ గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొంగ నోటు లాంటి పాస్ పుస్తకాల స్థానంలో ప్రభుత్వ రాజముద్ర తో ముద్రించిన పాస్ పుస్తకాలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం

 

➖ నెల్లూరు జిల్లాలో 235 గ్రామాల్లో 1.05 లక్షల మందికి పైగా రైతులకు జగన్ బొమ్మతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు

 

➖ ఆత్మకూరు నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో 13 గ్రామాల్లో 5486 ఈ పట్టాలను పంపిణీ చేశారు.. వీటి స్థానంలో నేడు ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టాం

 

➖ రీసర్వే పేరుతో చేపట్టిన భూముల సర్వేలో కూడా హద్దురాళ్లపై జగన్ బొమ్మలు ముద్రించి 650 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి ఆనం

 

➖ 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు,రైతన్నలకు అండగా నిలుస్తాం.: మంత్రి ఆనం

 

➖ ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను విజయవంతంగా అమలు చేశాం

 

➖ త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తాం : మంత్రి ఆనం

 

*విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేశాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

*గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,166 కోట్ల ట్రూప్‌అప్‌ చార్జీలను వసూలు చేసింది*

 

*ఇక నుంచి ట్రూఅప్‌ చార్జీల భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుంది*

 

*రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి రూ.4497 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది*

 

*తిరుపతి రీజియన్‌ పరిధిలో 1551.69 కోట్ల మేర ప్రజలకు లబ్ధి*

 

*విద్యుత్‌చార్జీలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నాం*

 

➖ ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం అన్నారెడ్డిపాలెం, చేజర్ల మండలం పెరుమళ్లపాడుకు నూతన సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి : మంత్రి ఆనం

 

➖ పెరుమాళ్లపాడులోని పురాతన శివాలయం పునర్నిర్మానికి రూ. 1.50 కోట్లు నిధులు మంజూరు చేశాం… మంచి శుభ ముహూర్తం చూసి పనులు ప్రారంభిస్తాం : మంత్రి

 

➖ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి ఆనం

Related posts

హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం – ప్రజాసేవలో హోంగార్డ్స్ సేవలు నిబద్ధతకు నిదర్శనం.

Garuda Telugu News

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల ఆధ్వర్యంలో డిజిటల్ జియో ట్యాగ్ సదుపాయం

Garuda Telugu News

మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్!

Garuda Telugu News

Leave a Comment