*చంద్రబాబు నాయడు పాలనలో రైతులు సుభిక్షంగా వున్నారు*

– బుచ్చిరెడ్డి పాళెం మండలం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణి.
– ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.
– పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల భూములకు భద్రత.
– పట్టాదార్ పాస్ బుక్ పై గల క్యు ఆర్ కోడ్ స్కాన్ చేసి భూమి వివారాలు తెలుసుకోవచ్చు.
– దశాబ్దాల తరబడి పూడికలు తీయని కాలువలను బాగు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాం.
– గతమెన్నడు లేనివిధంగా గిట్టుబాటు ధర కల్పించి, ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు వేసాం.
– మూడు విడతలుగా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణి చేసి సన్నకారు రైతులను ఆదుకున్నాం.
– 5 లక్షల 70 వేల రూపాయలు నిధులు కాగులపాడు గ్రామాభివృద్ధికి కేటాయించాం.
– త్వరలోనే కాగులపాడు జొన్నవాడ లింక్ రోడ్డు మరియు కోవూరు కాలువ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసి ఎన్నిల నాటి హామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాళెం మండలం కాగులపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బుచ్చిరెడ్డి పాళెం మండలానికి చెందిన చల్లాయపాళెం 458, పెనుబల్లి 596, పంచేడు 578, దామరమడుగు 752. జొన్నవాడ 268, కలయ కాగొల్లు 334, శ్రీరంగరాజపురం 133, రేబాల 945, నాగమాంబాపురం 269, మినగల్లు 368 కొత్తగా మంజూరైన 4 వేల 713 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ తాను ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు.
గత ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల భూములకు సిఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములకు భద్రత కల్పించారన్నారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన పట్టాదార్ పాస్ బుక్ పై గల క్యు ఆర్ కోడ్ స్కాన్ చేసి భూమి వివారాలు తెలుసుకోవచ్చని సర్వే నెంబర్లు, పేర్లలో ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే సరిదిద్దుకోవచ్చు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక దశాబ్దాల తరబడి పూడికలు తీయని కాలువలను కొన్ని ప్రభుత్వ పరంగాను మరికొన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బాగు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించామన్నారు. గతమెన్నడు లేనివిధంగా గిట్టుబాటు ధర కల్పించి, ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందన్నారు. మూడు విడతలుగా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణి చేసి సన్నకారు రైతులను ఆదుకున్నాంమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 20 నెలల కాలంలో అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, మత్స్యకార భరోసా, స్త్రీశక్తి తదితర సంక్షేమ పధకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు.
గత ఐదేళ్లలో తట్టెడు మట్టికి నోచుకోని గ్రామీణ ప్రాంత రోడ్ల దుస్థితికి నేటికీ ఎంతో మార్పు వుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాగులపాడు గ్రామంలో 50 లక్షల 70 వేల రూపాయలతో తాగునీరు, రోడ్లు, హాస్పిటల్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భముగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గుర్తు చేశారు. 2 కోట్ల రూపాయలతో కాగులపాడు జొన్నవాడ లింక్ రోడ్డు మరియు కోవూరు కాలువ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం తహసీల్దారు అంబటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రంతులయ్య బుచ్చి అగ్రికల్చరల్ బ్యాంక్ ఛైర్మెన్ ఏటూరి శివరామకృష్ణారెడ్డి, వవ్వేరు బ్యాంక్ డైరెక్టర్ మద్దసాని మాల్యాద్రి, టిడిపి సీనియర్ నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బత్తల హరికృష్ణ, కోడూరు కమలాకర్ రెడ్డి, చేనేత సంఘ నాయకులు కెవి శేషయ్య, స్థానిక నాయకులు ఎడెం ప్రసన్న కుమార్ రెడ్డి, రవి నాయుడు, ప్రతాప్ లతో పాటు టిడిపి యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీ ఇంచార్జీలు పాల్గొన్నారు.
