సీఎం సహాయనిధితో పేదలకు కార్పొరేట్ వైద్యం.

ఇప్పటివరకు 1485 మందికి రూ.12.29 కోట్ల సీఎంఆర్ఎఫ్ మంజూరు.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
రెడ్డిగూడెంలో సీఎంఆర్ఎఫ్ అందజేత.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 03.01.2026.
సీఎం సహాయనిధితో పేదలకు కార్పొరేట్ వైద్యం లభిస్తోందని, ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 1485 మందికి రూ.12.29 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.
రెడ్డిగూడెంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్.ఓ.సిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు లబ్దిదారులకు శనివారం అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ తాజాగా నియోజకవర్గ వ్యాప్తంగా 79 మందికి రూ.87 లక్షల సీఎంఆర్ఎఫ్ మంజూరు అయినట్లు వెల్లడించారు. వీటిలో 38 మందికి రూ.21.20 రీ ఎంబర్స్ మెంట్ చెక్కులు కాగా, 41 మందికి రూ.65.80 లక్షలు ఎల్.ఓ.సీల రూపంలో మంజూరు అయినట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
