*కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది: పవన్ కల్యాణ్*

* మల్యాల: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల తితిదే నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు.
