*సేవకు మారుపేరు గా వీపీఆర్ ఫౌండేషన్*

*వాటర్ ప్లాంట్ల ఏర్పాటే కాదు..నిర్వహణ బాధ్యత చేపట్టడం గొప్ప విషయం*
*గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం*
*అందరి సహకారంతో జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతాం*
*తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువులో వీపీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు ప్రారంభోత్సవం, రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ కామెంట్స్*
వీపీఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో వాటర్ ప్లాంటు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది
ఇప్పటికే 170 ప్లాంట్లు వీపీఆర్ ఫౌండేషన్ ప్రారంభించి, మెయింటినెన్స్ బాధ్యతలు కూడా చేపట్టింది
సంక్రాంతి లోపు మరో 19 ప్లాంట్లు ప్రారంభించబోతున్నారు
వీపీఆర్ నేత్ర, వీపీఆర్ వైద్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి
1200 మంది దివ్యాంగులకు కూడా బ్యాటరీ ట్రైసైకిళ్లు అందించడం గొప్ప విషయం
జిల్లాలో గిరిజనుల విషయంలో ప్రధానంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు
రోడ్డు పక్కన గిరిజనులు కనిపిస్తే ఆయన కారు ఆగిపోతుంది..వారి కష్టనష్టాలు తెలుసుకోవడంతో పాటు ఏదో ఒక చిరుసాయం చేసి ముందుకువెళుతుంటారు
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధితో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలోని గిరిజనులకు సేవ చేసేందుకు వీపీఆర్ ఫౌండేషన్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం
కోవూరు నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలకు విస్తరించబోతున్నారు
ప్రత్యేకంగా గిరిజనుల కోసం పనిచేసే ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి వీపీఆర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది
కోట మండలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి గిరిజనులకు సేవ చేయడంలో ముందున్నారు..వారితో వీపీఆర్ ఫౌండేషన్ కలిసిన నేపథ్యంలో గిరిజనుల సమూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం
జనవరి 4న కోవూరు నియోజకవర్గంతో పాటు కావలి నియోజకవర్గం అల్లూరులో గిరిజనులకు మెడికల్ స్క్రీనింగ్ చేయబోతున్నారు
పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేయడంతో పాటు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు అనేక సేవలు అందిస్తున్నారు
గిరిజనులు, మత్స్యకారులు, ముస్లిం, దళితులు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉన్నారు
వీపీఆర్ ఫౌండేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా అందరి సహకారం ఉంటుంది
జిల్లాలోని ప్రధాన రాజకీయ కుటుంబాలన్నింటితో కలసి పనిచేసిన అనుభవం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను
ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో భారతీయ జనతా పార్టీతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది
గతంలో అల్లూరు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా కమ్యూనిస్టు పార్టీలతోనూ కలసి నడిచివున్నాను
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాను
*కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, ఏపీ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్.శివప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులు*
