
02-03-26.
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ .
* కూటమి ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు ,
రాజ ముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు మరియు పంపిణీ…..
• ప్రజలకు తమ భూములపై భరోసాను కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తోంది.
• ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించింది.
• ఎలాంటి లోపాలు లేకుండా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసిన 7200 గ్రామాల పరిధిలోని 23 లక్షల మందికి ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం.
• కొత్త పాస్ పుస్తకాల పంపిణీతో 23 లక్షల మందికి వారి ఆస్తులపై నమ్మకాన్ని, భరోసాను , భద్రతను కల్పిస్తున్నాం.
* రాజకీయ ఫొటోల తొలగింపుకు నిర్ణయం ….
• ప్రజల ఆస్తిపై తమకు హక్కు ఉందన్నట్టుగా గత ప్రభుత్వం… నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను భూమి హక్కు పత్రాలపై ముద్రించింది… ప్రజాభీష్టం మేరకు వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
• కూటమి ప్రభుత్వం ఇస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వం మాదిరిగా రాజకీయ నేతల ఫొటోలను వేయలేదు.
• ప్రజల ఆస్తులపై రాజకీయ నేతల బొమ్మలు, స్టిక్కర్లు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రూపొందించాం.
• కూటమి ప్రభుత్వం భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వమే కానీ… ప్రజల ఆస్తులపై బొమ్మలు వేసుకునే ప్రభుత్వం కాదని ప్రజలంతా గుర్తించాలి.
* రీ-సర్వే 1.0 సమస్యలు మరియు పరిష్కారాలు….
• గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను… భూములను వివాదాల్లోకి నెట్టేసేలా రీసర్వే-1.0 చేపట్టింది.
• ఆ రీ-సర్వే అంతా తప్పుల తడక గా ఉండడంతో రైతుల ఆందోళనలను తప్పించేలా కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టింది.
• గత ప్రభుత్వం రీ-సర్వే చేపట్టిన 6688 గ్రామాల్లో సభలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదుల మేరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాం.
• 2,79,712 అర్జీలు రాగా 100 శాతం పరిష్కరించాం.
• రీ సర్వే పూర్తైన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎమ్ లను సబ్ డివిజన్ చేయించుకునేందుకు రైతులకు సబ్ డివిజన్ ఫీజును కూడా మాఫీ చేశాం.
* రీ-సర్వే 2.0 మరియు భవిష్యత్తు ప్రణాళిక….
• మొదటి విడతలో భాగంగా మరి కొన్ని గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం రీ-సర్వే చేపట్టింది.
• ఎలాంటి వివాదాలు లేకుండా… భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది.
• రీ సర్వే- 2.0ను కూటమి ప్రభుత్వం సమర్ధవంతం నిర్వహిస్తోంది. రైతులను భాగస్వామ్యులను చేసి తప్పులకు అస్కారం లేకుండా సర్వే చేపడుతోంది.
• ఇప్పటికే రెండు దశల్లో 1376 గ్రామాల్లో రీ సర్వే-2.0 పూర్తి చేశాం… ప్రస్తుతం మూడో దశ జరుగుతోంది… 2027 నాటికి రైతులకు సమస్యలు లేకుండా రీ సర్వే – 2.0ను పూర్తి చేస్తాం.
* ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మరియు 22ఏ భూముల పరిష్కారం….
• ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాల జారీతో వారిలో భరోసా కల్పించింది.
• దీంతోపాటు వివిధ రెవెన్యూ సంస్కరణలను కూటమి ప్రభుత్వం చేపట్టింది… ముఖ్యంగా 22ఏ భూముల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది.
• ప్రైవేట్ భూములు 22ఏ జాబితాలో ఉంటే… పరిశీలించి తొలగించమని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
• గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే సమయంలో తిరిగి 22ఏ జాబితాలో పెట్టిన మాజీ సైనికోద్యోగుల, స్వాతంత్ర్య సమర యోధుల, రాజకీయ భాదితుల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.
• వాళ్ల భూమిని నిర్ధారించే ఒక్క డాక్యుమెంట్ ఉన్నా జాబితా నుంచి తొలగిచాలని అదేశించింది.
* ఇతర ముఖ్యాంశాలు…
• అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు రెగ్యులరైజ్ చేస్తున్నాం… పేదలకు ఇళ్ల నిర్మాణం నిమిత్తం భూమి ఇస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్నాం.
• 2026 సంవత్సరంలో భూ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెడుతున్నామని సీఎంగారు చెప్పారు… ఇప్పుడు దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి.
