*వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు*

18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో హైకోర్టు తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆ స్వేచ్ఛ వారికి ఉందన్న కోర్టు
యువకుడికి 21 ఏళ్లు నిండలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం
యువతీయువకుల సహజీవనం విషయంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ వయస్సు రాకున్నా సరే యువతీయువకులు మేజర్లయితే పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది.
ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. యువకుడికి వివాహ వయస్సు రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందన్న యువకుడి ఆందోళన నేపథ్యంలో ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టును ఆశ్రయించిన యువ జంట
రాజస్థాన్ హైకోర్టులో 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరమూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని అం
