Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది

పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా   12-11-2025.

విషయము: *గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది.*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్* ఆధ్వర్యంలో *శ్రీ కోనేటి ఆదిమూలం గారి* ఆదేశాల మేరకు *15-11-2025 తేదీన అనగా ఈ శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి * ఎంకేటి మహల్, పిచ్చాటూరు, తిరుపతి జిల్లా(MKT Mahal,Opposite SBI Bank, Pichatur,Tirupati dist)* నందు జరగబోయే జాబ్ మేళా సంబంధించి గౌరవనీయులైన *శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా ఈరోజు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ (MPDO Office, Pichatur)నందు జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది మరియు పత్రికా విలేకరులతో జాబ్ మేళా ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు వివరించడం జరిగినది .*

ఇందులో భాగంగా *గౌరవ ఎమ్మెల్యే గారు, శ్రీ కోనేటి ఆదిమూలం గారు* మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈఎంసి క్లస్టర్,శ్రీ సిటీ , తిరుపతి, మరియు చెన్నైలోని *15* బహుళ జాతీయ కంపెనీలలో *750* పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు అదేవిధంగా *జాబ్ మేళా రోజు (15-11-2025) తేదీన జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుందని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు.*

ఇందులో భాగంగా సత్యవేడు నియోజకవర్గం లోని లేదా జిల్లా లోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు అని *ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి, తిరుపతి జిల్లా* ఒక ప్రకటనలో తెలియజేశారు.

రిజిస్ట్రేషన్ లింకు: *https://naipunyam.ap.gov.in/user-registration*

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ *14-11-2025.* మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.

ఇతర వివరములు కొరకు సంప్రదించండి:9440374535, 9988853335.(కాల్ సెంటర్).

గమనిక: *జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో ట్రైనీ (Trainee Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను*

 

ఈ కార్యక్రమంలో ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి, మరియు మహమ్మద్ రఫీ గారు ,పిచ్చాటూరు మండలం ఎంపీడీవో , శ్రీ సుబ్రహ్మణ్యం గారు, ఎమ్మార్వో, పిచ్చాటూరు మండలం, శ్రీ ఇలన్ గోవన్ గారు ,ఏఎంసీ చైర్మన్ ,ఏ.గణేష్ ,ప్లేస్మెంట్ ఆఫీసర్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలతో!

ఆర్ లోకనాథం,

జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,

తిరుపతి జిల్లా.

Related posts

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ ఉభయదారులు అవ్వడం మా పూర్వజన్మ సుకృతం

Garuda Telugu News

అందుకే మోదీ మాటను ప్రపంచ నేతలు వింటున్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్

Garuda Telugu News

ఫిబ్రవరి 11 నుంచి పులివెందుల శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు 

Garuda Telugu News

Leave a Comment