*షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ*

✍️ *మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఆర్థిక సాయం*
✍️ *కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీని కోరిన ఎమ్మెల్యే*
విద్యుత్ షాక్ తో హఠాన్మరణం చెందిన బుచ్చినాయుడు కండ్రిగ మండలం నీర్పకోట షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం పరామర్శించారు.
బుచ్చినాయుడు కండ్రిగ విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య శుక్రవారం విధి నిర్వహణలో ఉంటూ కరెంట్ షాక్ తో మరణించారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఉదయం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రికి చేరుకొని సాంబయ్య భౌతిక కాయానికి త్వరగా పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టారు.
అనంతరం సాంబయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రూ.10 వేలు మట్టి ఖర్చులకు ఆర్థిక సాయం అందించి, విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ టి మాట్లాడి ప్రభుత్వం ద్వారా అన్నీ విధాలుగా ఆదుకుంటామని బరోసా కల్పించారు.
సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
