సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా పద్మనాభరాజు నియామకం.

….నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో అరుణానిధి తీరాన ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన పద్మనాభరాజు నియమితులయ్యారు.
ధర్మకర్తల మండలి సభ్యులుగా సత్యవేడు పట్టణానికి చెందిన కృష్ణయ్య యాదవ్,ఇరుగుళం గ్రామానికి చెందిన మునికుమార్ సతీమణి జయంతి,కన్నవరం గ్రామానికి చెందిన ధనశేఖర్ సతీమణి దేవి,కేవిబి పురం మండలానికి చెందిన చంద్రశేఖర్ సతీమణి కవిత,సత్యవేడు మండలం మదనంబేడు గ్రామానికి చెందిన హేమంత్ కుమార్( జనసేన),నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య సతీమణి హంస,నాగలాపురంకు చెందిన నెల్సన్ మండేల,శ్రీనివాసులు,నాగభూషణమ్మ తదితరులు నియమితులయ్యారు.
దీంతోపాటు సురుటుపల్లి ఆలయ ప్రధాన అర్చకుడు కార్తికేసన్ కూడా ధర్మకర్తలి మండలిలో ఎక్స్ అప్సియో సభ్యుడుగా కొనసాగుతారు.ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇందులో భాగంగానే సురుటుపల్లి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి నియామకం కోసం ఆగస్టు 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 20 రోజులు పాటు దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం సెప్టెంబర్ 4,6, తేదీలలో దేవాదాయ శాఖ అధికారుల బృందం దరఖాస్తులను పరిశీలించారు.దరఖాస్తులు దాఖలు చేసిన ఆశావహుల్లో ప్రధానంగా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన పద్మనాభరాజు, సత్యవేడు మండలానికి చెందిన కృష్ణయ్యయాదవ్,కేవిబి పురం మండలానికి చెందిన రామాంజులునాయుడు ఉన్నట్టు ప్రచారం జోరందుకోవడంతోపాటు తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు.
ఈ నేపథ్యంలో సురుటపల్లి ఆలయ ధర్మకర్తల పాలకమండలి నియామకం సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ వద్ద జాప్యం నెలకొన్న నేపథ్యం, ఇందులో కూడా చైర్మన్ పదవి కోసం ఒకపక్క పిచ్చాటూరు మండలానికి చెందిన పద్మనాభరాజు, మరొక పక్క సత్యవేడు మండలానికి చెందిన కృష్ణయ్య యాదవ్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగింది.
ఈ క్రమంలో నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ జరిగింది.దీంతో మెజార్టీ అభిప్రాయం పద్మనాభరాజు వైపే మొగ్గు చూపడంతో ఎట్టకేలకు సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్గా పద్మనాభరాజును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడింది.త్వరలోనే పాలకమండలి బాధ్యతలను స్వీకరించనున్నట్టు తెలిసింది.
