
*ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ*
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
యధాప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

