Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నేను సైతం.. అంటూన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్

* ఏపీ డిప్యూటీ సీఎం పదవిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ డిమాండ్‌ను వినిపించారు.ఇదే రీతిలో గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనీ నేను సైతం అంటూ మనసులో మాట చెప్పారు.*

*ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పాశిం సునీల్ కుమార్ ‘‘డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ బాబు అన్ని విధాలా అర్హులే. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి లోకేష్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు పడిన తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారు. లోకేష్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన లోకేష్ పేరును ఈ పదవికి పరిశీలించాలని టీడీపీ హై కమాండ్‌ను కోరుతున్నాను’’ అని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు*

*నేను సైతం.. అంటూన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్*

*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గని డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి నారా లోకేష్ వంద శాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు.*

*లోకేష్ బాబు పోరాటపటిమను చూసిటీడీపి కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని* *జైకొట్టింది. డిప్యూటీ సిఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను అని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తన* *మనస్సులో మాట ను వెల్లడించారు.*

Related posts

ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఇంటి పై మళ్లీ ఏసీబీ దాడులు…

Garuda Telugu News

సైనా ఏకాదశి సందర్భంగా గరుడ దాత్రి చౌడేపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానము

Garuda Telugu News

నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీకరణ పత్రం

Garuda Telugu News

Leave a Comment