Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

*రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

✍️ *పేరడం లో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

✍️ *పేరడం పాఠశాలకు మరో టీచర్ ను నియమించాలి*

 

అన్నదాతల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.

 

మంగళవారం సత్యవేడు మండలం పేరడం లో అన్నదాతలకు ప్రభుత్వం అందించే నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీ సర్వే ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో భూములను సర్వే చేసి రైతులకు శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తుందన్నారు.

 

అలాగే సబ్సిడీ విత్తనాలు, గిట్టుబాటు ధరలకు రైతుల నుండి పంట కొనుగోలు, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు.

 

అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.

 

*పేరడం ప్రభుత్వ పాఠశాలకు మరో టీచర్ ను వేయండి*

 

పేరడం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండు కాళ్ళు లేని ఉపాధ్యాయురాలు సుకన్య ఒక్కరే టీచర్ గా పనిచేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం వెంటనే జిల్లా విద్యా శాఖ అధికారికి ఫోన్ చేసి ఈ పాఠశాలకు మరో టీచర్ ను నియమించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…

Garuda Telugu News

దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు

Garuda Telugu News

అగ్రకులోన్మాద దాడి , ఆటో డ్రైవర్ మృతి కేసులో పోలీసుల అదుపులో నిందితులు?

Garuda Telugu News

Leave a Comment