Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ హైవే అవసరం

*నెల్లూరులో ఎక్స్ ప్రెస్ హైవే అవసరం*

*నగర పరిధిలో 18 క్రాసింగులు*

*ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అదొక్కటే మార్గం*

*హౌసింగ్ అక్రమాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి*

*ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి*

 

*నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

 

*ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, బల్లి కళ్యాణ చక్రవర్తి, జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఇన్ చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా అధికారులు*

 

*సమావేశంలో సోమిరెడ్డి ప్రస్తావించిన అంశాలు*

 

గిరిజనులు, నిరుపేదల ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి థర్డ్ పార్ట్ విచారణలోనూ నిర్ధారణ అయింది

 

పేదల ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి

 

హౌసింగ్ శాఖపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

 

రిలయన్స్ కంపెనీ కోసం ముత్తుకూరు మండలంలో సేకరించిన 2600 ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి

 

17 ఏళ్లుగా పంటలు లేకుండా ఖాళీగా ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

 

పూడిపర్తిలో 1981లో దళితులు, గిరిజనులకు కేటాయించిన 400 ఎకరాలకు పైగా భూములు కర్రతుమ్మ చెట్లతో అడవులుగా మారాయి

 

జిల్లాకు విశ్వసముద్ర, క్రిబ్ కో ఇథనాల్ ప్లాంట్లు వచ్చిన నేపథ్యంలో ఆ భూముల్లో మొక్కజొన్న సాగుపై దృష్టి పెట్టాలి

 

ఆ భూములు సాగులోకి వస్తే 100కి దళిత, గిరిజన కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది

 

నెల్లూరు నగర పరిధిలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది..లెవల్ క్రాసింగుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి

 

బుజబుజనెల్లూరు నుంచి పెన్నావంతెన వరకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం అవసరమవుతుంది…ఈ విషయమై నేను గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశాను

 

జిల్లా ఎంపీలు ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టాలి..

Related posts

తోటపల్లి గూడూరు మండలంలో కాకాణి పర్యటన

Garuda Telugu News

జగన్ ను క్షమించి వదిలేస్తున్నా

Garuda Telugu News

ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడి….

Garuda Telugu News

Leave a Comment