Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి..

*ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి..*

నాగలాపురం: గతంలో ఉన్న విదంగానే ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంగా కొనసాగింపు చేయాలని నూతనంగా వికసిత్ భారత్ జీరాంజీ పేరును మార్పు చేయడం సరికాదని రైతు సంఘ అధ్యక్షులు చిన్నదొరై అన్నారు.

ఈ మేరకు సోమవారం స్థానిక మేజర్ పంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పంచ్ చిన్నదొరై సుధా ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు డ్వామా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నదొరై మాట్లాడుతూ ఉపాది హామీ పథకం ప్రారంభమే మహాత్మా గాంధీ పేరిట ఆ పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

అలాగే 125 రోజులు పని దినాలు పెంపొందింనప్పట్కి సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ద్వారా అనేక మంది నిరుపేద కూలీలు రోజువారి జీవనం సాగిస్తున్నారని.

అంతటి గొప్ప కార్యక్రమం పై రాజకీయం చేయడం సరికాదని ఆయన హితువు పలికారు.

ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ సునీత, ప్రజా ప్రతినిదులు, వార్డు మెంబర్లు, డెప్యుటీ ఎంపిడిఓ మునిరత్నం, పంచాయతి కార్యదర్శి రాధిక, జూనియర్ అసిస్టెంట్ వెంకటరామ రాజు, ప్రభాకర్, సచివాలయ సిబ్బందులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

టిటిడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం

Garuda Telugu News

చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు గుర్తింపు

Garuda Telugu News

పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

Garuda Telugu News

Leave a Comment