Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు

*దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు*

– విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం

 

– మంత్రి అచ్చెన్నాయుడు

 

*అమరావతి,జనవరి 4:* విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ… ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం ఎదుర్కొంది. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగం. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పులపాలు చేశారు. 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారు. కానీ జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపాడు. విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ.1.29 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు.

 

*బాధ్యతాయుత పాలన, చారిత్రాత్మక నిర్ణయాలు*

 

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్లు విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించింది. 2019–2024 కాలానికి సంబంధించి రూ.4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేయాలంటూ ఏపీఆర్సీ లేఖ రాసినా, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయం. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం, ముఖ్యమంత్రి చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితం. ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్‌కు 13 పైసలు తగ్గాయి.

 

*రైతులకు, వినియోగదారులకు నేరుగా లాభం*

 

జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.1.50కు తగ్గించడం కీలక నిర్ణయం. గత ప్రభుత్వంలో రూ.5.19కు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.4.70కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరకే విద్యుత్ను కొనుగోలు చేస్తూ, రిన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తోంది. సోలార్ పవర్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోలార్ పవర్ ప్రోత్సాహానికి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు, బీసీ వర్గాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీపై అదనంగా రూ.20 వేల అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం అందిస్తోందిని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు.

 

*జారీ చేసిన వారు: పిఆర్వో – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాల‌యం*

Related posts

రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన మార్పుకు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Garuda Telugu News

ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..! _ హైదరాబాద్ యువకుడు మృతి

Garuda Telugu News

పర్యాటకంగా గంగమ్మ ఆలయాభివృద్ధి కి సహకారం అందిస్తాం…

Garuda Telugu News

Leave a Comment