Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధారణ మరియు ఇతర రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

*చిత్తూరు జిల్లా పోలీసు*

*రోడ్డు భద్రతా నియమాలపై చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS, గారి ఆదేశాల మేరకు జిల్లా అంతటా హెల్మెట్ ధారణ మరియు ఇతర రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.*

 

*ఈ సందర్బంగా చిత్తూరు పట్టణములోని గాంధీ కూడలిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ గారు హెల్మెట్ ధారణ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.*

 

చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలిలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తల గాయాల వల్ల ప్రాణనష్టం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా మారితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.

 

ప్రజలందరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి, తమ కుటుంబాల భవిష్యత్తును సురక్షితంగా కాపాడుకోవాలని, చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టం జరుగుతుందని గుర్తించాలన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేకపోయినా, ప్రాణ నష్టం సంభవించే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

Related posts

విఆర్ కండ్రిక వద్ద దెబ్బతిన్న మినీవంతెనను పరిశీలించిన శంకర్ రెడ్డి..

Garuda Telugu News

సత్యవేడు టీడీపీలో చర్చ.. ఎమ్మెల్యే కార్యక్రమాలకు  ప్రవీణ్ రెడ్డి డుమ్మా..!

Garuda Telugu News

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు

Garuda Telugu News

Leave a Comment