Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

డీకేటి పట్టాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ గారికి వినతిపత్రం…..

*డీకేటి పట్టాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ గారికి వినతిపత్రం…..*

వడమాల పేట తాసిల్దార్ గారికి 05/01/2026 వ తేదీన జరీనా గారికి వినతి పత్రం ఇవ్వడం అయినది. ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై నందయ్య మాట్లాడుతూ మండలంలో అనుభవంలో ఉన్న భూములకు డీకేటి పట్టాలు ఇవ్వాలని ఒకే కుటుంబంలో రెండు మూడు కాపురాలు కలిగి ఉన్నాయి. వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని,ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని వడమాల పేట టీజి ఆర్ఎస్ లో వినతి పత్రం ఇవ్వడం అయినది. స్పందించిన తాసిల్దార్ గారు భూములను సర్వే చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇస్తామని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో స్మశానం ఏర్పాటు చేసి దారి సౌకర్యం కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మికుల సంఘం కార్యదర్శి ఈ.శ్రీనివాసులు,కె.మణి,టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.

Garuda Telugu News

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు

Garuda Telugu News

ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..! _ హైదరాబాద్ యువకుడు మృతి

Garuda Telugu News

Leave a Comment